ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Yuvagalam_Jaitrayatra_Vijayotsava_Sabha_in_Polepalli

ETV Bharat / videos

20న టీడీపీ యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభ: అచ్చెన్నాయుడు - Nara Lokesh Yuvagalam Concluding meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2023, 1:49 PM IST

Yuvagalam Jaitrayatra Vijayotsava Sabha in Polepalli :తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర పూర్తి కానుంది. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో టీడీపీ యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభ నిర్వహించనున్నారు. పోలేపల్లిలో భారీ సభ ఏర్పాటు చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఈ సభా కార్యక్రమం ఏర్పాట్లను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Atchannaidu) సమీక్షించారు.

Achchennaidu Comments on yuvagalam Closing Ceremony :యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభ గురించి  అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఎన్నికల శంఖారావం పూరించే సభగా విజయోత్సవ సభను అభివర్ణించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా రానున్నారని, దీని కోసం 16 కమిటీలు వేశామని తెలిపారు. సభకు దాదాపు 6 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

TDP Leaders Comments on Yuvagalam Vijayotsava Sabha :యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభకు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక రైళ్లను సైతం ఏర్పాటు చేసిందని అచ్చెన్నాయుడు తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి 7 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ప్రత్యేక రైళ్లు ఈ నెల 19న చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ప్రారంభమై తరువాత రోజు విజయనగరం చేరుకోనున్నాయి. ఒక్కో రైలులో 1300 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. మరో వైపు అద్దెకు బస్సులను సమకూర్చాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. 

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details