YSRCP Sarpanch Welfare Association President Resigned వైసీపీకి రాజీనామా చేసిన రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు.. - Sarpanchula President Resigned From YSRCP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 30, 2023, 5:53 PM IST
Sarpanchula Welfare Association President Resigned From YSRCP: రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సీహెచ్ పాపారావు, కార్యదర్శి నరేంద్రబాబులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. విజయవాడలోని ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు రాజీనామా పత్రాన్ని వెల్లడించారు. త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నట్లు వారు ప్రకటించారు.
CH Paparao Comments:సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సీహెచ్ పాపారావు మీడియాతో మాట్లాడుతూ..''సర్పంచుల పట్ల వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కరెక్ట్‌గా లేదు. 15వ ఆర్థిక సంఘం నిధులు మాకే తెలియకుండా దారి మళ్లించారు. మాకు నిధులు, విధులు లేవని నిజాంపట్నంలో సీఎంను కలిసి చెప్పాం. మళ్లీ సీఎంను కలవాలని అపాయింట్‌మెంట్ కోసం ఎందరినో కలిశాం. కానీ ఫలితం లేకపోకుండా పోయింది. అందుకే ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది సర్పంచులు వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సర్పంచుల వ్యవస్థకు సమాంతరంగా వాలంటరీ వ్యవస్థను తెచ్చారు. ఇదేం న్యాయం..? ప్రభుత్వం సర్పంచిల వ్యవస్థను డమ్మీగా మార్చింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీకి రాజీనామా చేస్తున్నా.'' అని ఆయన అన్నారు.
Narendra Babu Comments: పంచాయతీరాజ్ వ్యవస్థకు సమాంతరంగా వాలంటరీ వ్యవస్థను తేవడాన్ని కాగ్ కూడా తప్పు పట్టిందని.. సర్పంచుల సంఘం కార్యదర్శి నరేంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో 13వేల మంది సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని, సర్పంచులు తలుచుకుంటే 50 లక్షల ఓట్లు ప్రభావితమవుతాయని గుర్తు చేశారు. తమ సమస్యలపై పోరాటం ఉద్ధృతం చేస్తామని నరేంద్రబాబు పేర్కొన్నారు.