'బండి కాదు మొండి సాయం పట్టండి' జంక్షన్లో తుస్సుమన్న 'బస్సు' - వైసీపీ నేతల పాట్లు - traffic problem due to ycp yatra bus trouble
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 17, 2023, 11:57 AM IST
YSRCP Samajika Sadikara Yatra in Vijayanagaram: విజయనగరం జిల్లాలో వైసీపీ(YCP) ప్రభుత్వం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర తుస్సుమంది. రాజం పట్టణంలో గురువారం అంబేడ్కర్ కూడలి సమీపంలో సామాజిక సాధికార యాత్ర నిర్వహించారు. సదస్సు అనంతరం బస్సు స్టార్ట్ కాకపోవడంతో పార్టీ నాయకులు అవస్థలు పడ్డారు.
People Comments on Government about Bus Facility: సామాజిక సాధికార యాత్ర సదస్సు ముగిసిన తర్వాత డ్రైవర్ ఎంత ప్రయత్నించినప్పటికీ బస్సు స్టార్ట్ కాలేదు. దీంతో పలువురు స్థానికులు బస్సును ముందు, వెనక వైపు నుంచి నెట్టినప్పటికీ కొంతసేపు వరకు స్టార్ట్ కాలేదు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పోలీసులు సైతం బస్సు ను నెట్టి సహాయం చేశారు. కొంత సమయం తర్వాత బస్సు స్టార్ట్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రజా ప్రతినిధులు ప్రయాణించే బస్సు ఇలా ఉంటే గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఏమిటని పలువురు పెదవి విరుస్తున్నారు.