వైఎస్సార్సీపీ బస్సు యాత్ర కోసం షాపులు బంద్ - ఆ షాప్‌లకు మాత్రం వెసులుబాటు! - sadikara bus yatra
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 1:49 PM IST
YSRCP Samajika Sadhikara Yatra: అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్సార్సీపీ బీసీ సాధికారిక బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టింది. బస్సు యాత్ర నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఉదయం నుంచి నగరంలోని రహదారులపై రాకపోకలపై ఆంక్షలు విధించారు. కర్నూలు, చిత్తూరు, తిరుపతి, ఆర్టీసీ బస్టాండు రోడ్డుతోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చే బస్సులను పట్టణంలోకి రాకుండా రింగ్ రోడ్ల వద్దే దారిమళ్లించారు. పట్టణంలోని కొత్తపేట గాలివీడు ఇరుకైన రోడ్డు మార్గాలలో బస్సులను అనుమతించడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి. ఆర్టీసీ బస్టాండ్‌కు బస్సులు రాకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల వేచిచూసే పరిస్థితులు నెలకొన్నాయి.
జాతీయ రహదారిపై సభను ఏర్పాటు చేయడంతో రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలు కనిపించకుండా భారీగా భార్యకెట్లు ఏర్పాటు చేశారు. దాంతో దుకాణాలు మూసివేసి వేయాల్సి వచ్చింది. కానీ, అటుగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌కు మాత్రం దారిని వదిలారు. దుకాణాలు ముసేసి బార్‌కు వదలడంపై పలు విమర్శలకు దారితీసింది. ఈ సభ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:00 కొనసాగనుంది.