YSRCP Oppose No Confidence Motion in Lok Sabha: అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి - అవిశ్వాస తీర్మానానికి వైసీపీ వ్యతిరేకం
YSRCP Oppose No Confidence Motion in Lok Sabha : కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి లేవనెత్తిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. బుధవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చలో లోక్‌సభ పక్షనేత, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు సభకు తెలిపారు. అధికార ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నందున ఈ అవిశ్వాస తీర్మానానికి విలువ లేదని తమ పార్టీ భావిస్తోందని ఆయన అన్నారు. మణిపుర్‌లో మహిళలపై చోటు చేసుకున్న ఘటనలు చాలా బాధాకరం అన్న మిథున్‌రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా అక్కడ శాంతి స్థాపన జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన లోక్‌సభలో కోరారు.
"మణిపుర్‌లో మహిళలపై జరిగిన నేరాలు చాలా బాధాకరం. వీలైనంత త్వరగా అక్కడ శాంతి స్థాపన జరిగేలా చూడాలని కోరుకుంటున్నాం. అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది. అధికార ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానానికి విలువ లేదని మేము భావిస్తున్నాం."- మిథున్‌రెడ్డి, లోక్‌సభ పక్షనేత