ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSRCP MPTC Vijayalakshmi angry with Minister Ambati Rambabu

ETV Bharat / videos

'రాంబాబూ నీకిదే లాస్ట్ సంక్రాంతి' - ఓటమి ఖాయమంటూ మహిళా ఎంపీటీసీ ఆగ్రహం - వైసీపీ మంత్రి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 14, 2024, 5:47 PM IST

Updated : Jan 15, 2024, 6:41 AM IST

YSRCP MPTC Vijayalakshmi angry with Minister Ambati Rambabu: ఓవైపు మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల్లో తేలియాడుతుంటే, మరో వైపు అంబటి వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పెదమక్కెనకు చెందిన ఎంపీటీసీ వీడియో విడుదల చేసింది. తాము అంబటి గెలుపుకోసం కష్టపడి పనిచేస్తే, నేడు తమను మంత్రి రోడ్డుపై వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. 

వివరాల్లోకి వెళ్తే, సంబరాల రాంబాబుకు ఇవే చివరి వేడుకలు అంటూ వైఎస్సార్సీపీ ఎంపీటీసీ విజయలక్ష్మి మంత్రి అంబటిని హెచ్చరించారు.  రాబోయే ఎన్నికల్లో అంబటి ఓటమి పాలవ్వడం ఖాయమని తెల్చి చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్ అంటే అభిమానం అని, ఆ అభిమానంతోనే పార్టీ కోసం పని చేసినట్లు ఎంపీటీసీ విజయలక్ష్మి తెలిపారు. అంబటి గెలుపు కోసం తన భర్త 50 లక్షలు ఖర్చు చేస్తే కనీసం గుర్తించలేదని, పైగా తన కోసం ఏం చేశారంటూ అంబటి ఎదురు ప్రశ్నలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశమై మంత్రిని అడిగితే జగన్ దగ్గరకు వెళ్లి చెప్పుకో అంటున్నాడని విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తాము రాంబాబు కోసం కష్టపడి పనిచేస్తే, గెలిచిన తరువాత పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లను కాదని, ఇతరులను నెత్తిన పెట్టుకున్నాడని మండిపడ్డారు. ప్రతీ ఊరులో ఎంపీటీసీలు, సర్పంచ్​లు వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డారని, వారందరినీ అంబటి రాంబాబు పక్కన పెట్టాడని ఆరోపించారు.

Last Updated : Jan 15, 2024, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details