YSRCP MP Vallabhaneni Balashauri on MP Ticket మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి మళ్ళీ నేనే పోటీ చేస్తా.. ఎంపీ వల్లభనేని బాలశౌరి - YSRCP MP Vallabhaneni Balashauri news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 8, 2023, 10:27 PM IST
YSRCP MP Vallabhaneni Balashauri on MP Ticket రాబోయే ఎన్నికల్లో కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి మరల తానే పోటీ చేయబోతున్నానని.. వైఎస్సార్సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రకటించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు అప్పగించిన పనిని చేసుకుంటూ ముందుకు సాగుతున్నానన్న బాలశౌరి.. ఇప్పటివరకు తనపై ఏ ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేసిన దాఖలాలు లేవని అన్నారు.
MP Vallabhaneni Balashauri Comments: మచిలీపట్నం పోర్టు పనులు, ట్రాఫిక్ సమస్యలు, గుడివాడలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణాలపై ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ''మచిలీపట్నం పార్లమెంటు ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు నూటికి నూరు శాతం చేరువ చేయడంలో కృషి చేస్తున్నాను. గుడివాడలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నాము. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే విధంగా చర్యలు చేపట్టాము. మచిలీపట్నం పోర్టు పనులకు సంబంధించిన నిధుల మంజూరులో విషయంలో ప్రముఖ పాత్ర వహించాను. పోర్టు నిర్మాణ పనులు పూర్తైతే.. యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే, బందరు ప్రజల చిరకాల వాంఛ తీరుతోంది. పోర్ట్ నిర్మాణం, మెడికల్ కాలేజీ, నూతన రైల్వే స్టేషన్ ఏర్పాటు, హార్బర్ నిర్మాణాల పనులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో శరవేగంగా పూర్తవుతున్నాయి. నాపై ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా.. వాళ్ల విజ్ఞతకే వదిలి వేస్తున్నాను. నన్ను ఎంపీగా గెలిపించిన ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం.'' అని బాలశౌరి అన్నారు.