MLA Dwarampudi fire on Pawan: పవన్ నా మీద పోటీ చేయ్.. తుక్కు తుక్కుగా ఓడిస్తా: ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి - pawan kalyan comments
MLA Dwarampudi Challenge to Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైవైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. వచ్చే ఎన్నికల్లో కాకినాడలో పవన్ కల్యాణ్‍ను తుక్కు తక్కుగా ఓడించకపోతే తన పేరే చంద్రశేఖర్ రెడ్డే కాదన్నారు.కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్‌పై చంద్రశేఖర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ''పవన్.. నామీద చేసిన ఆరోపణలు నిరూపించు. మేము కాకినాడలో గత 50 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నాము. సామాజికంగా మాకు ఎలాంటి బలం లేకపోయినా.. మమ్మల్ని ఇక్కడి ప్రజలు రెండు సార్లు గెలిపించారు. కాకినాడ జిల్లాలో నన్ను ఓడించడం నీ వల్ల (పవన్) కాదు. నన్ను ఓడిస్తానని నువ్వు చేసిన చేసిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నా.. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో కాకినాడలో నా మీద నువ్వు పోటీ చేయ్.. నేను నిన్ను తుక్కు తుక్కుగా ఓడిస్తా పవన్.. ఎమ్మెల్యే, సీఎం అవ్వాలంటే నీకూ సినిమాల్లోనే సాధ్యం... అక్కడ చేసుకో వెళ్లి’’ అని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్నటి ద్వారంపూడి సభలో ప్రసంగిస్తూ..''ద్వారంపూడి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డీకి రోజులు దగ్గర పడ్డాయి. ఇకనుంచి లెక్కపెట్టుకో.. మీ నేరసామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తాను.. మీ జగన్ మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాను.. నీ సంగతీ చూస్తాను.. మీ తాతకు చేసినట్టుగా నిన్ను బేడీలేసి లాక్కెళ్తాం.. మీ తాతను డీటీ నాయక్ తీసుకెళ్తే.. నీకు బీమ్లానాయక్ ట్రీట్మెంట్ నేనిస్తా.. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే.. నా పేరే పవన్ కల్యాణ్ కాదు.. మా పార్టీ జనసేన కాదు'' అంటూ వ్యాఖ్యానించారు.