టీడీపీలోకి భారీ వలసలు - పెద్దముడియంలో 25 కుటుంబాలు చేరిక - jammalamadugu news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 13, 2024, 2:29 PM IST
YSRCP Members Joining TDP Party :వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డికి పెద్ద ముడియం మండల వాసులు ఘన స్వాగతం పలికారు. శనివారం రోజున భూషష్ రెడ్డి పెద్దముడియం మండలంలోని ఉలవపల్లె, కొత్తపల్లె గ్రామాల్లో పర్యటించారు. స్థానికంగా ఉన్న రాముల గుడిలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భూపేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి సమక్షంలో ఉలవపల్లె, కొత్తపల్లె గ్రామాలకు చెందిన 25 కుటుంబాలు ఎస్సార్సీపీని విడి టీడీపీలో చేరాయి. వారికి భూపేశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
రానున్న ఎన్నికల్లో టీడీపీనే అధికార పగ్గాలు చేపడుతుందని భూపేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చాక జమ్మలమడుగు నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.