ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSRCP_Members_Joined_in_TDP

ETV Bharat / videos

చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరిన వైసీపీ నేతలు - బాబు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2024, 9:56 PM IST

YSRCP Members Joined in TDP: తెలుగుదేశం అధినేత చంద్రబాబు (TDP Leader Chandrababu) సమక్షంలో వైఎస్​ఆర్​సీపీ నేతలు భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు. రైల్వే కోడూరు నుంచి ముక్కు రూపానంద రెడ్డి, కదిరి నుంచి పవన్ కుమార్ రెడ్డి, మడకశిర నుంచి ఎంవీ.రమేష్, శ్రీకాకుళం నుంచి రెడ్డి చిరంజీవి , చీపురుపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, వారి అనుచరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. 

అంతకు ముందు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి చంద్రబాబు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, పంచుమర్తి అనురాధ, షరీఫ్ ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన కార్యకర్తలకు చంద్రబాబు ధ్రువ పత్రాలను అందజేశారు. 

ABOUT THE AUTHOR

...view details