ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSRCP_Leaders_Resign_in_Bapatla_District

ETV Bharat / videos

వైఎస్సార్​సీపీలో అభివృద్ధి లేదు - రాష్ట్ర ప్రచార కార్యదర్శి మురళి కృష్ణ - BapatlaYSRCPLeadersResign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2024, 12:30 PM IST

YSRCP Leaders Resign in Bapatla District: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేని పార్టీలో తాము ఉండలేమంటూ పలువురు వైఎస్సార్​సీపీ నాయకులు రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం బలిజేపల్లి, వరహాపురం, అబ్బన గూడవల్లి గ్రామాలకు చెందిన పలువురు నాయకులతో కలసి వైఎస్సార్​సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మురళి కృష్ణ పార్టీనీ వీడారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసినా తమకు ఎలాంటి గుర్తింపు లేదని కార్యకర్తలు, నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చేయలేని శాఖలో ఉండకూడదని, అభివృద్ధి ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలని నిర్ణయించుకొని పార్టీకి రాజీనామా చేస్తున్నామని స్పష్టం చేశారు. రాజీనామాల అనంతరం తమ కార్యచరణ ప్రకటిస్తామని మురళి కృష్ణ తెలిపారు. 

పార్టీనీ నమ్ముకున్న తమను పక్కన పెట్టి బయటి వ్యక్తులను ప్రోత్సహించడం బాధాకరం అన్నారు. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రచార కార్యదర్శిగా 10 సంవత్సరాల నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరించి అభివృద్ధికి కృషి చేశానని మురళి కృష్ణ వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details