YSRCP Leaders Remove TDP Flag: టీడీపీ జెండాను తొలగించిన వైఎస్సార్సీపీ నేతలు.. మంత్రి అండతోనేనని ఆరోపణలు - AP Latest News
YSRCP Leaders Remove TDP Flag in Baligam : శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో వైఎస్సాసీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. మందస మండలం బాలిగాంలో టీడీపీ జెండా ఉన్న దిమ్మెను వైఎస్సాసీపీ నేతలు అర్ధరాత్రి వేళ పడగొట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి సిదిరి అప్పలరాజు ప్రోద్బలంతోనే ఈ అరాచకాలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సారాల క్రితమే బాలిగాం వచ్చిన మంత్రి అప్పలరాజు టీడీపీ జెండా దిమ్మెను తొలగించాలని.. అప్పుడే తన అనుచరులతో చెప్పారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆ దిమ్మె తొలగించేంత వరకు బాలిగాం రానని మంత్రి ప్రతిన బూనారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ గ్రామానికి రాలేదని టీడీపీ నేతలు అన్నారు. సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉన్న నేపథ్యంలో టీడీపీ దిమ్మెను తొలగించారని టీడీపీ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అక్కడే జెండాను ఏర్పాటు చేస్తామని టీడీపీ నేతలు ప్రకటించారు. రానున్న రోజుల్లో తగని మూల్యం చెల్లించుకుంటారని టీడీపీ నేతలు హెచ్చరించారు.