ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ysrcp_leaders_occupied_mrps_leaders_lands

ETV Bharat / videos

అధికార వైసీపీ నాయకుల దౌర్జన్యం - దళితుల భూముల కబ్జా యత్నంపై ఎమ్మార్పీఎస్ ఆగ్రహం - ఏపీలో వైసీపీ నాయకులు భూమి కబ్జా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 10:45 PM IST

YSRCP Leaders Occupied MRPS Leaders Lands: అధికార పార్టీ నాయకులు, అధికారులతో కుమ్మక్కై తమ భూములను కబ్జా చేస్తున్నారని ఎమ్మార్పీఎస్​ నాయకులు ఆరోపిస్తున్నారు. తమకు ఆ భూములకు పట్టాలు జారీ చేశారని, కానీ, కొంతమంది ఎమ్మెల్యే అండతో ఈ చర్యకు పూనుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ స్థలాల్లో కంచె ఏర్పాటు చేసి వెంచర్లు ఏర్పాటు చేయాలని చూస్తున్నారని వారు అన్నారు.

అనంతపురం జిల్లాలోని  కురుగుంట గ్రామంలోని 41 సర్వేనెంబర్​లో 6ఎకరాల భూమి ఉందని ఎమ్మార్పీఎస్​ నాయకులు తెలిపారు. దానిని 2010లో తమకు స్థలాలు మంజూరు చేస్తూ పట్టాలు జారీ చేశారని వివరించారు. కానీ, కొంత మంది అధికార పార్టీ నేతలు స్థానిక ఎమ్మెల్యే అండతో కబ్జా చేయాలని చూస్తున్నారని అన్నారు. తామ భూముల్లో వెంచర్​ ఏర్పాటుకు వైసీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. పేదలకు కేటాయించిన భూములను ఇలా అక్రమించుకోవడం సరికాదని హెచ్చరించారు. తమ స్థలాలను సాధించుకునే వరకు తమ పోరాటం ఆపేది లేదని ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details