ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయుల సమావేశం - 'మళ్లీ టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వం' - వైసీపీ పార్టీ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 1:10 PM IST
YSRCP Leaders Meeting And Discuss in MLA Ticket: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వ్యతిరేక వర్గీయులు గురువారం సమావేశం నిర్వహించారు. దొరవారిసత్రం మండలం వెదురుపట్టు రోడ్డు సమీపంలోని వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి పుచ్చకాయల రామ్మోహన్ రెడ్డి మామిడి తోటలో ఈ సమావేశం జరిగింది. నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సూళ్లూరుపేట పురపాలక సంఘం ఛైర్మెన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే సంజీవయ్యకు మళ్లీ టిక్కెట్ ఇస్తే గెలవడని అన్నారు. ఆయనకు తాము మద్ధతు ఇవ్వబోమని స్పష్టం చేస్తూ కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాలని కోరారు. ఎమ్మెల్యే సంజీవయ్య నాయకులు, పార్టీ కార్యకర్తలను చెప్పుదెబ్బలు కొట్టారని పేర్కొన్నారు. పలువురు సీనియర్ నాయకులు సంజీవయ్యకు టికెట్ ఇవ్వొద్దని సూచించారు. మళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్టు సంజీవయ్యకు ఇస్తే నియోజకవర్గం సర్వనాశనం అవుతుందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఆయనకే టికెట్ ఇచ్చినట్లు పలువురు తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీమంత్ రెడ్డి మండిపడ్డారు.