టీడీపీలోకి భారీగా వలసలు - పచ్చకండువా కప్పుకొన్న వైసీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు - కర్నూలు జిల్లా టీడీపీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 7, 2024, 5:35 PM IST
YSRCP Leaders Joins TDP Party: పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. పాణ్యం టీడీపీ బాధ్యురాలు గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. పాలకొలను సర్పంచ్ సుజాతమ్మ, పాటు చింతలపల్లె సర్పంచ్ వెంకటరమణ కొమరోలు ఎంపీటీసీ శేషమ్మ తదితరులు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.
కర్నూలు జిల్లా పాణ్యంలో వైఎస్సార్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఓర్వకల్లు మండలంలో ఇద్దరు సర్పంచ్లు ఒక ఎంపీటీసీతో పాటుగా మండలం లోని పలు గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తెలుగుదేశంలో చేరారు. పాణ్యం నియోజకవర్గ తెలుగుదేశం బాధ్యురాలు గౌరు చరిత రెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన టీడీపీ నేతలు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాటసాని దౌర్జన్యాలు అరాచకాలు ప్రజలు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపిస్తారని పేర్కొన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొనే ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డికి ఎక్కడ చూసినా నిరసనలు ఎదురవుతున్నాయన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అరాచకాలను చూడలేక ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.