ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSRCP_Leaders_Joinings_in_TDP

ETV Bharat / videos

టీడీపీలోకి వలసల జోరు - టీడీపీతోనే పంచాయతీలకు మహర్దశ - TDP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 12:26 PM IST

YSRCP Leaders Joinings in TDP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరు పెరిగింది. అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ సర్పంచ్‌, ఎంపీటీసీలు గురువారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. బెన్నవరం సర్పంచ్ బచ్చల సన్యాసమ్మ, దేవరపల్లి సర్పంచ్ సిరబాల బుజ్జిబాబు, లగిశపల్లి సర్పంచ్ పార్వతమ్మ, తుంపాడ సర్పంచ్ సూర్యకాంతం, పాడేరు రైతు సంఘం అధ్యక్షులు ముట్టడం సరబన్న పడాల్, ప్రభుత్వ మాజీ ఉద్యోగి కిల్లు వెంకటరమేష్ నాయుడుతో పాటు పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిని చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు.

Babu Called To Win TDP In Next Elections: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిన తరువాత స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయని, సర్పంచ్​లను ప్రభుత్వం ఉత్సవ విగ్రహాల్లా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు మళ్లీ మహర్దశ రావాలంటే టీడీపీతోనే సాధ్యం అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. పాడేరులో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపేందుకు కృషి చేయాలని బాబు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details