టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు - సీఎం జగన్‌కు సొంత జిల్లాలో భారీ షాక్ - cm ys jagan
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 7, 2024, 7:39 PM IST
YSRCP Leaders Joined to TDP: సీఎం జగన్‌కు ( CM YS Jagan) సొంత జిల్లాలో షాక్ తగిలింది. వేంపల్లిలో వైసీపీకు చెందిన 10 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. గండి ఆంజనేయ స్వామి దేవస్థానం మాజీ ఛైర్మన్ రమణతోపాటు వైసీపీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (Btech Ravi) కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్పై వ్యతిరేకతతో వైసీపీ నాయకులు తండోపతండాలుగా తెలుగుదేశంలో చేరుతున్నారని బీటెక్ రవి అన్నారు.
గిడ్డింగివారిపల్లి చెరువు అభివృద్ధి ముసుగులో కోట్లు కొట్టేశారని రవి ఆరోపించారు. త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతామని బీటెక్ రవి అన్నారు. ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ అధికారుల చిట్టా బయటికి తీసి అందర్నీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. షర్మిల కాంగ్రెస్లో చేరితే తెలుగుదేశం పార్టీకి ఎలాంటి లాభం, నష్టం లేదన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే నిజాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.