ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSRCP_Leaders_Bike_Rally_Against_MLA_Chandra_Prasad

ETV Bharat / videos

YSRCP Leaders Bike Rally Against MLA Chandra Prasad: "ఈ ఎమ్మెల్యే వద్దు.. జగన్ ముద్దు" అంటూ చంద్రప్రసాద్​కు వ్యతిరేకంగా వైసీపీ నేతల బైక్‌ ర్యాలీ - protest to MLA Chandra Prasad from ycp leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2023, 4:40 PM IST

Updated : Oct 21, 2023, 4:51 PM IST

YSRCP Leaders Bike Rally Against MLA Chandra Prasad :కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్​కు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అసమ్మతి నేతలు రౌతులపూడిలో శనివారం భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్‌కు ఇప్పటికే అసమ్మతి నేతల పర్వం ఎక్కువైయింది. ఈ నేపథ్యంలో "ఎమ్మెల్యే ప్రసాద్‌ వద్దు- సీఎం జగన్‌ ముద్దు" అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

"ఎమ్మెల్యే ప్రసాద్ వద్దు..సీఎం జగన్ ముద్దు" అంటూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉదయం ప్రదర్శన చేపట్టారు. ఈ  పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. ఎమ్మెల్యే చంద్ర ప్రసాద్‌కు వ్యతిరేకంగా, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు మద్దతిస్తూ పలువురు నేతలు అన్నవరంలో సమావేశం నిర్వహిస్తుండటం నియోజకవర్గ వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఏలేశ్వరం, రౌతులపూడి, ప్రత్తిపాడు మండలాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ అసమ్మతి నేతలు నిరసన తెలుపుతూ అన్నవరం వెళ్లారు. 

Last Updated : Oct 21, 2023, 4:51 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details