Attack on Hotel Staff: బిల్లు విషయంలో గొడవ.. హోటల్ నిర్వాహకులపై వైసీపీ నేతల దాడి..! - srcp leaders attack on Hotel Staff in adoni
Attack on Hotel Staff: కర్నూలు జిల్లా ఆదోనిలో హోటల్ నిర్వాహకులపై దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన వారు వైసీపీ నాయకులని.. హోటల్ యజమాని తెలిపారు. తొలుత హోటల్‌కి వచ్చిన కొంతమంది వ్యక్తులు.. ఫుడ్ ఆర్డడ్ చేసి తెప్పించుకున్నారు. తరువాత దానికి సంబంధించిన డబ్బులను ఆన్లైన్ ద్వారా చెల్లించామని చెప్పారు. కానీ ఆ డబ్బులు తమకు రాలేదని హోటల్ సిబ్బంది చెప్పారు. ఫుడ్‌కి సరిపడా నగదు చెల్లించి.. ఆర్డర్ తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినవారు.. హోటల్ సిబ్బందిపై దాడి చేశారు. హోటల్ యజమాని శ్రీనివాస్, పలువురు సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తూ.. వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో హోటల్ యజమానితో పాటు సిబ్బందికి గాయాలు అయ్యాయి. ఈ దృశ్యాలు అన్నీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే దాడి చేసినవారు వైసీపీ నాయకులని హోటల్ యజమాని చెప్తున్నారు. తమ తప్పు లేకున్నా గుంపుగా వచ్చి దాడికి పాల్పడ్డారని హోటల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.