ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSRCP Leader Occupying House Plots

ETV Bharat / videos

YSRCP Leader Occupying House Plots: వైసీపీ నేతా.. మజాకా.. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు కబ్జాకు యత్నం - sarpanch father Occupying house plots in Kanigiri

By

Published : Aug 8, 2023, 8:43 PM IST

YSRCP Leader Occupying House Plots in Kanigiri: గత ప్రభుత్వం పంపీణీ చేసిన ఇళ్ల స్థలాలను కబ్జా చేసేందుకు వైసీపీ నేత కుటిల యత్నం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ కాలనీలో గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆ స్థలాలను అధికార పార్టీకి చెందిన ఓ నేత ఆక్రమించడానికి చూస్తున్నాడని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గత ప్రభుత్వం హయాంలో టీడీపీ నేత ఉగ్ర నరసింహారెడ్డి అర్బన్ కాలనీ ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అప్పట్లో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు కొందరు ఇళ్లు నిర్మించుకోగా.. మరికొందరు స్తోమత లేక బేస్​మెంట్​ వరకే నిర్మించుకున్నారు. ప్రస్తుత అధికార పార్టీకి చెందిన ఓ సర్పంచ్ తండ్రి.. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అర్బన్ కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు నకిలీవని.. తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ తండ్రి రాత్రికి రాత్రే పునాదులను, సరిహద్దు రాళ్లను తొలగించి కబ్జా చేసేందుకు ఫెన్సింగ్​ రాళ్లు ఆ ప్రాంతానికి చేర్చి.. ఫెన్సింగ్​ వేసేందుకు సిద్ధం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న లబ్దిదారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తమకిచ్చిన ఇళ్ల స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details