ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSRCP_Government_Try_To_Implement_Free_APSRTC_Services_to_Women

ETV Bharat / videos

తెలుగుదేశం హామీలతో వైఎస్సార్సీపీ ఉలిక్కిపాటు - ఆర్టీసీ అధికారులతో జగన్ సర్కార్ రహస్య చర్చలు - Free Travel For Women in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 12:40 PM IST

YSRCP Government Try To Implement Free APSRTC Services to Women :వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపిస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తామంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. ఈ హామీపై మహిళల నుంచి మంచి స్పందన వస్తుండటంతో ఆఘమేఘాలపై ముందుగా తామే అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఆర్టీసీ అధికారులతో CMO, GAD అధికారులు రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. జనవరిలో, వీలైతే సంక్రాంతి పండుగ నుంచి దీనిని అమలులోకి తీసుకొచ్చేందుకు చూస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Free APSRTC Services to Women in AP :కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మహిళలకు బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పటికే తెలుగుదేశం ఇచ్చిన ఈ హామీని ముందే అమలు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు విశాఖపట్నం, విజయవాడలోని సర్వీసుల్లో దీనిని అమలు చేసే వీలుందని తెలిసింది. 

ABOUT THE AUTHOR

...view details