YSRCP Followers Attack on TDP Leader Vehicle: నగరి టీడీపీ ఇంచార్జ్ వాహనంపై వైసీపీ మూకదాడి.. ఉద్రిక్తత
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 13, 2023, 4:50 PM IST
YSRCP Followers Attack on TDP Leader: అధికార వైసీపీ మూకల అల్లర్లకు అంతులేకుండా పోతోంది. చిత్తూరు జిల్లాలోని నగరిలో వైసీపీ మూకలు రెచ్చిపోయారు. విచక్షణ రహితంగా టీడీపీ నేత వాహనంపై దాడికి తెగబడ్డారు. నగరి తెలుగుదేశం ఇంఛార్జ్ గాలి భాను ప్రకాష్ వాహనంపై వైసీపీ మూక దాడికి తెగబడింది. నగరి ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యేందుకు భాను ప్రకాశ్ వస్తున్న క్రమంలో వైసీపీ మూకలు ఆయన వాహనంపై దాడి చేశారు. దీంతో దాడి సమాచారం తెలుసుకుని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఏరియా ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు.
గాలి భాను ప్రకాష్ నేతృత్వంలో టీడీపీ శ్రేణులు స్థానిక పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. అడుగడుగునా ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక మండపం వద్ద మంత్రి రోజా ఇంటి ముట్టడికి తెలుగుదేశం కార్యకర్తలు యత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న గాలి భానుప్రకాష్.. వైసీపీ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
TAGGED:
Attack on TDP Leader