ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSRCP_Follower_Attack_on_Sarpanch

ETV Bharat / videos

అంబాపురం సర్పంచ్​పై దాడిని నిరసిస్తూ ఆందోళనలు - YSRCP Follower Arrest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 1:38 PM IST

YSRCP Follower Attack on Sarpanch: విజయవాడ అంబాపురంలో గ్రామసర్పంచ్‌ సీతయ్యపై దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ‌డ్డెర సంఘం నాయకులు బుధవారం నిరసన చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేయాలని వడ్డెర సంఘం ఐక్య వేదిక ఆధ్వర్యంలో టూ టౌన్‌ పోలీస్ స్టేషన్‌ ఎదుట ఆందోళనలు చేశారు. నిందితుడిని అరెస్టు చేసేంతవరకూ నిరసనలు ఆపబోమని నాయకులు స్పష్టం చేశారు. సర్పంచ్​పై దాడి చేసిన వీడియోలు సాక్ష్యాలుగా ఉన్నా పోలీసులు అతనిపై కేసు నమోదు చేయకుండా ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు అవ్వటంతో అరెస్టు చేయలేదన్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేయకుంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉద్యమాలు చేస్తామని వడ్డెర నాయకులు స్పష్టం చేశారు. 

Vaddera community Leaders Protest To Arrest Accused:సర్పంచ్ స్థాయి వ్యక్తిపై జరిగిన దాడినే పట్టించుకోకపోతే సామాన్యుల పరిస్థితి  ఏంటని నాయకులు ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వ‌డ్డెరులపై దాడులు పెరిగిపోయాయని, నిందితుడిని అరెస్టు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులుపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details