YSRCP Differences Emerged in Chirala Constituency: అధికార పార్టీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. కుర్చీలతో కొట్టుకున్న నేతలు - YCP leaders beating with chairs
YSRCP differences emerged in Chirala constituency: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీలోని శ్రేణుల మధ్య నెలకొన్న వర్గ విభేదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులు రెండు వర్గాలు విడిపోయి అందరూ చూస్తుండగానే ఆఫీసుల్లో, రోడ్లపై కర్రలు, రాడ్లతో దాడులు చేసుకుంటున్నారు. తాజాగా బాపట్ల జిల్లా వేటపాలం మండలం రామన్నపేట పంచాయతీలో వైఎస్సార్సీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుతూ..కుర్చీలతో కొట్టుకున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
YCP Faction Differences: భగ్గమన్న వైసీపీ వర్గ విభేదాలు.. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య విభేదాలు మరోసారి బయట పడ్డాయి. వేటపాలం మండలం రామన్నపేట పంచాయతీలోని 6, 10 వార్డులకు జరగనున్న నామినేషన్ల సమయంలో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరామకృష్ణమూర్తి వర్గీయుల మధ్య వివాదం రాజుకుంది. ఓ వైసీపీ వర్గ నేతను మరో వర్గీయులు.. కార్యాలయం నుంచి బయటకు గెంటేస్తూ, పిడి గుద్దులు గుద్దుతూ.. కుర్చీతో దాడి చేశారు. దీంతో కొద్దిసేపు పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓట్లు తెచ్చుకోలేక ఈ విధంగా తనపై దౌర్జన్యం చేస్తారా..? అంటూ బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.