YSRCP Councillor Husband Harassing Woman Volunteer: మహిళా వాలంటీర్‌ను వేధిస్తున్న వైసీపీ మహిళా నేత భర్త.. నిలదీసినందుకు కుంటుంబంపై దాడి - husband of the councilor molested the volunteer
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 17, 2023, 10:21 AM IST
YSRCP Councillor Husband Harassing Woman Volunteerin Vuyyuru : కృష్ణా జిల్లాలో ఉయ్యూరులోని రెండో వార్డు వైఎస్సార్సీపీ మహిళా కౌన్సిలర్ సుభద్ర భర్త సురేష్.. పట్టణంలో ఓ మహిళా వాలంటీర్‌ను మానసికంగా వేధిస్తున్నట్లు బాధితురాలు అర్ధరాత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 1వ సచివాలయం ఆడ్మిన్‌తో తనకు చిన్న వివాదం వచ్చిందని, ఆ వివాదంలో తనకి అనుకూలంగా ఉంటానని చెప్పిన సురేష్.. దీన్ని ఆదునుగా తీసుకుని తనని మానసికంగా వేధించడం మెుదలు పెట్టాడని మహిళా వాలంటీర్ వాపోయింది. ఆ వేధింపులు భరించలేక ఆమె తన భర్తకు, కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆ విషయాన్ని అడగటానికి వెళ్లిన కుటుంబ సభ్యులపై కౌన్సిలర్ సుభద్ర దూషించి, దాడి చేయించారని (YCP Councillor Attack on Woman Volunteer Family) తెలిపారు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయలేదని భావించిన బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో వైసీపీ పెద్దలు రాజీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని సదరు మహిళా వాలంటీర్ వాపోయింది.