ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ysrcp_class_war_in_bapatla_district

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 12:47 PM IST

ETV Bharat / videos

వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు - పోటాపోటీ సమావేశాల్లో మాటల యుద్ధం

YSRCP Class War in Bapatla District : బాపట్ల జిల్లా చినగంజాం మండలం వైసీపీలో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. ఒక వర్గం సమావేశం ఏర్పాటు చేసి.. మరో వర్గంపై తీవ్ర విమర్శలు, ఆరోణలు చేసుకుంటున్నారు. పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు, అసమ్మతి వర్గీయుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మంగళవారం ఆమంచి కృష్ణమోహన్​కు వ్యతిరేకంగా ఆయన వ్యతిరేక వర్గం సభ నిర్వహించింది. ఆ సభలో ఆ మంచిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యతిరేకవర్గం పెద్ద ఎత్తున గళాన్ని వినిపించారు. 

మరోవైపు చినగంజాం మండలం కొత్తపాలెంలో ఆమంచి అనుకూల వర్గం.. సమావేశం ఏర్పాటు చేసి అమంచిపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టింది. ఆమంచి కృష్ణమోహన్​పై ఆరోపణలు చేయడం తగదని.. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అన్నారు. అమంచిపై ఆరోపణలు చేస్తున్న నాయకులు.. ఆరోపణలను నిరూపించాలని సవాల్​ విసిరారు. పర్చూరు వైసీపీ ఇంచార్జ్​గా అమంచిని.. సీఎం జగన్​ మోహన్​ రెడ్డి నియమించారని గుర్తు చేశారు. అమంచి నియోజకవర్గంలోని అందర్ని కలుపుకొని పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details