ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ysrcp_bus_yatra_in_pathapatnam_srikakulam_district

ETV Bharat / videos

వైసీపీ బస్సుయాత్రకు ప్రజాస్పందన కరవు - నేతలు మాట్లాడుతుండగానే జనం తిరుగుముఖం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 9:40 PM IST

YSRCP Bus Yatra in Pathapatnam Srikakulam District: అధికార వైసీపీ అట్టహాసంగా నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్రలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా సభలను నిర్వహిస్తున్నా ప్రజల నుంచి స్పందన లభించడం లేదు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను నిర్వహించారు. ఈ సాధికార సభ ప్రారంభానికి ముందే ప్రజలు ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. 

ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రసంగం చేసిన తర్వాత సగం మంది ఖాళీ కావడంతో వెంటనే ముఖ్య నేతలు ప్రసంగాలను ప్రారంభించారు. ప్రధాన రహదారిపై అడ్డంగా సభ వేదికను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సభ ఏర్పాటు చేయడానికి స్థానిక పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. దుకాణాలకు అడ్డుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, అంతేకాకుండా బలవంతంగా షాపులను మూసివేయించారని వ్యాపారులు అసహనం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని పాతపట్నంలోనికి అనుమతించకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details