YSRCP And TDP FIGHT: రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. టీడీపీ శ్రేణులపై కత్తులు, రాళ్లతో దాడి - ఏపీ నేటీ వార్తలు
YSRCP And TDP FIGHT : తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో టీడీపీపై వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడిలో టీడీపీ నేత వెంకటేష్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. సుళ్లూరుపేట రైల్వే స్టేషన్ సమీపంలో టీడీపీ మద్దతుదారుడు సునీల్ యాదవ్ ఫాస్ట్ ఫుడ్ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ కేంద్రంలో భోజనం చేసిన కోళ్లమిట్ట ప్రాంతానికి చెందిన కార్యకర్తలు డబ్బులు చెల్లించకుండా వెళ్లడానికి ప్రయత్నించారు. సునీల్ యాదవ్ డబ్బులు చెల్లించాలని కోరడంతో మద్యం మత్తులో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి దిగారు. సునీల్ యాదవ్పై దాడి జరగడంతో సమాచారం తెలుసుకొన్న వెంకటేష్ యాదవ్ ఫాస్ట్ ఫుడ్ కేంద్రం వద్దకు చేరుకొన్నారు. సునీల్ యాదవ్కు మద్దతుగా నిలవడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కత్తులు, రాళ్లతో దాడి చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడిలో వెంకటేష్ యాదవ్కు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో దాదాపు 20 మంది పాల్గొన్నట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.