YSRCP Excessive publicity: 'కోడి, బాతు గుడ్లు చూశాం కానీ.. ఈ వైయస్సార్ గుడ్డేంటబ్బా..!' - Excessive YCP publicity
YCP Excessive publicity: వైసీపీ పాలకుల ప్రచార పిచ్చి రోజు రోజుకు పెచ్చుమీరుతోంది. ప్రభుత్వం అందించే వస్తువులపై వైఎస్ఆర్సీపీ ముద్ర, జగన్ చిత్రాలను ముద్రిస్తున్నారు. బాలింతలు, గర్భిణులకు అందించే గుడ్లు, వివిధ రకాల సరకులపైనా వైయస్ఆర్ ఎస్పీ (సంపూర్ణ పోషణ) అని ముద్రించి మధ్యలో జగన్ బొమ్మను వేస్తున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఆ సరకులను పంపిణీ చేశారు. అవి చూసిన మహిళలు విస్మయానికి గురయ్యారు. గుడ్లపై వైయస్ఆర్ఎస్పీ అనే ముద్ర వారిని ఆలోచనలో పడేసింది. ఈ క్రమంలో కోడి, బాతు గుడ్లు చూశాంకానీ.. ఈ వైయస్సార్ గుడ్డేంటబ్బా..!అనే ఛలోక్తులు సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి. కాగా.. గర్భిణులు, బాలింతల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనత నివారణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకం' కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం బాలింతలకు, గర్భిణులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు.