ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSRCP MLA karasamu

ETV Bharat / videos

YSRCP MLA karasamu అవినాష్ రెడ్డికి బెయిల్.. కర్రసాము చేస్తూ కిందపడ్డ వైసీపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్ - ycp news

By

Published : Jun 1, 2023, 1:06 PM IST

Updated : Jun 1, 2023, 1:13 PM IST

YSRCP Proddutur MLA Rachamallu Siva Prasad Reddy karasamu video: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వందలాది మంది కార్యకర్తల మధ్య కర్రసాము చేస్తూ.. ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో ఈలలు వేస్తూ ఆనందంతో కర్రసామును తిలకించిన పార్టీ శ్రేణులు.. ఒక్కసారిగా ఆందోళనకు గురై  హూటాహుటిన ఆ ఎమ్మెల్యేను పైకి లేపారు. అనంతరం కిందపడిన సమయంలో గాయాలు ఏమైనా అయ్యాయా.. అంటూ ఎమ్మెల్యేను పలువురు కార్యకర్తలు అడుగగా.. ఏమీ అవ్వలేదంటూ ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌గా మారింది.

కర్రసాము చేస్తూ కిందపడ్డ ఎమ్మెల్యే రాచమల్లు.. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కర్రసాము చేస్తూ కిందపడ్డారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి.. తెలంగాణ హైకోర్టు తాజాగా షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే రాచమల్లు నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు.. మార్కెట్ యార్డు నుంచి 108 కలశాలతో శివాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

వైరల్‌గా మారిన ఎమ్మెల్యే కర్రసాము వీడియో..  ర్యాలీలో భాగంగా ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కర్రసాము చేస్తూ.. కార్యకర్తలను ఆనందపరిచే ప్రయత్నంలో ఒక్కసారిగా కర్ర కాలికి తగలడంతో ఉన్నట్టుండి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను పైకి లేపారు. అనంతరం అక్కడి నుంచి హూటాహుటిన వెళ్లిన ఎమ్మెల్యే.. ఆలయంలోకి వెళ్లి పూజలు చేశారు. సంఘటన సమయంలో సెల్‌ఫోన్లలో వీడియోను చిత్రీకరించిన పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

Last Updated : Jun 1, 2023, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details