Illegal Soil Excavation: అధికార పార్టీ నేతల అడ్డగోలు మట్టి తవ్వకాలు.. అడ్డుకున్న గ్రామస్థులు - వైఎస్సార్సీపీ నేతల అక్రమ మట్టి తవ్వకాలు
Illegal Soil Excavation in Bapatla District: వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నేతలు అడ్డగోలుగా జరుపుతున్న మట్టి తవ్వకాలను గామస్థులు అడ్డుకున్నారు. ఈ సంఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. కొల్లూరు మండలం చినపులివర్రు వద్ద భట్టిప్రోలు డ్రెయిన్లో అధికార పార్టీకి చెందిన కొందరు మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి తవ్విన మట్టిని బయట మార్కెట్లో అధిక ధరకు అమ్ముకుంటున్నారు. ఈ సమాచారం అందుకున్న గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ తవ్వకాలు చేస్తున్న అధికార పార్టీకి చెందిన వారు గ్రామస్థులతో వాగ్వాదానికి దిగారు. ఇది కాస్త ఇరు వర్గాల మధ్య గొడవకు దారి తీసింది. ఈ విషయం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెవిన్యూ అధికారులు తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని ప్రస్తుతానికి తవ్వకాలు ఆపివేశారు. నిందితులు వారం రోజుల క్రితం కూడా ఈ విధంగా తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించగా వారిని స్థానికులు అడ్డకున్నారు. నిందితులు మళ్లీ రాత్రి సమయంలో తవ్వకాలు చేపట్టారని సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు.