YSP Leaders Attack on Dalits in Anantapur : దాడికి దిగిన వైసీపీ నేతలు.. బిక్కుబిక్కుమంటూ రైతన్నలు.. - anantapur latest news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2023, 1:52 PM IST
YSP Leaders Attack on Dalits in Anantapur : అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం వేదవతి నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకున్న దళిత రైతులపై వైసీపీ నాయకులు దాడి చేశారు. బాధిత రైతులు గుమ్మగట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైసీపీ మాజీ కన్వీనర్ మంజునాథ్, ఆయన సోదరులు, బంధువులు కలిసి.. తమపై దాడికి దిగారని రైతులు తెలిపారు. మంజునాథ్ అనే వ్యక్తి, అతని వర్గీయులు వేదవతి నది నుంచి నిత్యం ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారన్నారు.
Atrocities of YSP Leaders on Dalits : ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి బోర్ల వద్ద ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని చెప్పినందుకు తమపై దాడికి పాల్పడ్డారని రైతులు తెలిపారు. దళితులకు, అధికార వైసీపీ నాయకులకు ఘర్షణ చోటు చేసుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ గొడవ కారణంగా ప్రాణభయంతో దళిత రైతులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నామన్నారు.