ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Viveka_Murder_Case_Adjourned_to_October_6

ETV Bharat / videos

YS Viveka Murder Case: వైఎస్​ వివేకా హత్య కేసు.. విచారణ ఈ నెల 6వ తేదీకి వాయిదా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2023, 6:20 PM IST

YS Viveka Murder Case Adjourned to October 6: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణను.. సీబీఐ కోర్టు అక్టోబర్​ 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు విచారణకు హాజరయ్యారు. చంచల్ గూడ జైల్లో జ్యుడీషియల్​ ఖైదీలుగా ఉన్న ఐదుగురికి రిమాండ్​ను ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించింది. దీంతో పోలీసులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను చంచల్​గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ అధికారులను ఆదేశిస్తూ అక్టోబర్​ 6వ తేదీకి వాయిదా వేసింది.  

ఈ కేసులో నిందితునిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఇప్పటికే ఎస్కార్ట్ బెయిల్ పై ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న భాస్కర్ రెడ్డికి చికిత్స కోసం ఈ నెల 10వ తేదీ వరకు సీబీఐ కోర్టు ఎస్కార్టు బెయిల్ పొడిగించింది. ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు చేయాలని భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్​ను దాఖలు చేశారు. గతంలోనూ భాస్కర్ రెడ్డి వేసిన సాధారణ బెయిల్ పిటిషన్​ను సీబీఐ కోర్టు కొట్టేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో మరోసారి సీబీఐ కోర్టులోనే వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details