ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YS_Viveka_Daughter_Sunitha_Met_Kadapa_SP

ETV Bharat / videos

కడప ఎస్పీని కలిసిన వైఎస్‌ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి - YS Viveka Daughter YS Sunitha

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2023, 5:49 PM IST

YS Viveka Daughter Sunitha Met Kadapa SP: మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి.. ఇవాళ కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్​ని కలిశారు. నూతన ఎస్పీగా ఇటీవల సిద్ధార్థ కౌశల్ బాధ్యతలు చేపట్టడంతో తొలిసారిగా ఆయన్ని సునీత దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. వివేక హత్య కేసుకు సంబంధించి పూర్వాపరాలు, తాజాపరిణామాలపై సునీత, రాజశేఖర్ రెడ్డి.. కడప ఎస్పీకి వివరించినట్లు సమాచారం. ప్రస్తుతం వివేక హత్య కేసు హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో పులివెందులలో తాజా పరిణామాల దృష్ట్యా సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి భద్రతపై చర్చించినట్లు తెలిసింది. అదే విధంగా ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న దస్తగిరి గురించి సైతం చర్చించినట్లు తెలిసింది. ఇటీవల వివేకా కేసులో అప్రూవర్​గా మారిన దస్తగిరిని అక్రమంగా కేసులో ఇరికించి జైలుకు పంపారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు తాజాగా దస్తగిరి భార్య సైతం తన భర్తకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దస్తగిరిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details