ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YS Vimala

ETV Bharat / videos

YS Vimala On Avinash Case: 'వాళ్లు బయట తిరుగుతుంటే.. ఏమీ చేయనివాళ్లు జైల్లో ఉన్నారు' - కర్నూలు జిల్లా తాజా వార్తలు

By

Published : May 24, 2023, 7:55 PM IST

YS Vimala Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హత్య చేసినవారు బయట విచ్చలవిడిగా తిరుగుతుంటే.. ఏమీ చెయ్యనివారు జైళ్లో ఉన్నారని వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి వైఎస్ విమలా రెడ్డి అన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని పరామర్శించేందుకు కర్నూలుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. అవినాష్ రెడ్డి ఏ తప్పూ చేయలేదని అన్నారు. భర్త జైలులో ఉండటం.. కొడుకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరగటంతో శ్రీలక్ష్మి ఆందోళన చెందుతున్నారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం చాలా కష్టాల్లో వుందని.. ఈ కేసులో నుంచి అవినాష్ రెడ్డి బయట పడతారని, న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.  

కుటుంబంలో ఇద్దరూ (అవినాష్ రెడ్డి, సునీత ) నాకు దగ్గర వారేనని.. సునీత మొదట కుటుంబ సభ్యులు హత్య కేసులో లేరని చెప్పి.. ఇప్పుడు అవినాష్ రెడ్డిని కేసులో పెట్టడం బాధగా ఉందన్నారు. సునీతను తప్ప చేస్తున్నావని చెప్పడంతో ఆమె మాట్లాడడం లేదని విమాలా రెడ్డి తెలిపారు. సునీత వెనక దుష్ట శక్తులు పని చేస్తున్నాయని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details