ఆంధ్రప్రదేశ్

andhra pradesh

vijayamma to kurnool hospital

ETV Bharat / videos

YS Vijayamma at Kurnool: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిని పరామర్శించిన వైఎస్​ విజయమ్మ - YS Vijayamma visited Avinash Reddy mother

By

Published : May 22, 2023, 9:49 PM IST

YS Vijayamma visited Avinash Reddy mother: వివేకా హత్య కేసు విచారణలో  ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్​పై కర్నూలులో ఉత్కంఠ కొనసాగుతుంది. కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్​లో అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాకపోవడంతో.. సీబీఐ అధికారులు కర్నూలు చేరుకున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో ఉదయం నుంచి ఆస్పత్రి దగ్గర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్​ వాతావరణం కనిపిస్తోంది. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొన్న వేళ అవినాష్ తల్లి  శ్రీలక్ష్మిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ పరామర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వద్ద వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకున్నారు.

 వైఎస్‌ విజయమ్మ ఆసుపత్రికి వచ్చిన దృశ్యాలు మీడియా చిత్రీకరిస్తుండగా వైసీపీకి చెందిన  శ్రేణులు దాడికి యత్నించారు. ఎంపీ అవినాష్ అనుచరులు  మీడియా ప్రతినిధులను  దుర్భాషలాడుతూ.. వెంబడించారు.  అవినాష్‌ అనుచరుల దౌర్జన్యంతో  మీడియా ప్రతినిధులు పరుగులు తీశారు. భవనం పైనుంచి చిత్రీకరిస్తున్న ప్రతినిధిపైకి రాళ్లు రువ్వారు.  ఎంపీ అవినాష్ అనుచరుల దౌర్జన్యం అనంతరం  ఆస్పత్రి వద్ద మీడియా ప్రతినిధులు  భయాందోళన కార్యక్రమం చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details