వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ - పలు షరతులు విధించిన సీబీఐ కోర్టు - రాయలసీమ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2023, 6:52 PM IST
YS Bhaskar Reddy Gets Interim Bail: వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు (CBI court) మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పలు షరతులతో... ఈనెల 30 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు ముగిసిన అనంతరం డిసెంబర్ 1న ఉ.10.30 గంటలకు చంచల్‌గూడ జైలుకు వెళ్లాలని సీబీఐ కోర్టు బెయిల్ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది. విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు కోర్టులో భాస్కర్‌రెడ్డి పాస్‌పోర్టు సరెండర్ చేయాలని ఆదేశించింది. భాస్కర్‌రెడ్డి చిరునామా వివరాలనూ... సీబీఐకి ఇవ్వాలని కోర్టు సూచించింది.
ఏదైనా చికిత్సకు వెళ్లాల్సి వస్తే... వివరాలను సీబీఐ అధికారులకు ముందుగా తెలపాలని షరతులు విధించింది. బెయిల్ పై విడుదలైన అనంతరం.. కేవలం కుటుంబసభ్యులను తప్ప మిగతా ఎవరినీ కలవొద్దని సీబీఐ కోర్టు ఆదేశించింది. గత సెప్టెంబర్ 20 నుంచి వైఎస్ భాస్కర్ రెడ్డి ఎస్కార్ట్ బెయిల్‌పై విడుదలయ్యారు. గతంలో ఇచ్చిన ఎస్కార్ట్ బెయిల్‌ను మధ్యంతర బెయిల్‌గా సీబీఐ కోర్టు మారుస్తూ బెయిల్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది.