ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రమదానంతో రహదారికి​ మరమ్మతులు

ETV Bharat / videos

Youth Repaired Road: పట్టించుకోని ప్రభుత్వం.. యువకుల శ్రమదానం - సత్యసాయి జిల్లాలో రోడ్డుపై గుంతలు పూడ్చిన యువకులు

By

Published : Jul 18, 2023, 10:55 PM IST

Youth Repaired Road in Satya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలో యువకులు శ్రమదానం చేశారు. ఎన్నాళ్లుగానో గోతులతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఉపశమనం కల్పించి.. అనేకమందితో ప్రశంసలు పొందుతున్నారు. కదిరి మండలంలోని గొల్లోళ్ల చెరువు రహదారిపై గుంతలు ఏర్పడి పూర్తిగా ధ్వంసమైంది. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించుకున్నా స్పందించలేదని చౌటతండా, చిగిరిమానుతండా ప్రజలు అంటున్నారు. రహదారి అధ్వానంగా మారటంతో గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇది గమనించిన ఆ గ్రామాల యువకులు మరమ్మతులకు పూనుకున్నారు. గుంతలు పడిన రోడ్డుతో ఎదురవుతున్న సమస్యల నుంచి బయటపడేందుకు చౌటతండా, చిగిరిమానుతండా పంచాయతీలకు చెందిన యువకులు సొంతంగా రోడ్డు మరమ్మతులకు సిద్ధమయ్యారు. చందాలు సేకరించి శ్రమదానంతో గుంతలను పూడ్చివేశారు. రహదారి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు చౌటతండా, చిగిరిమానుతండా గ్రామాల ప్రజలు అన్నారు. ఏదైనా వాహనం ఈ దారి గుండా రావాలంటే రోడ్డు సరిగా లేక ఆలస్యమయ్యేదని.. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే సమయానికి చేరుకోలేక నరకంగా ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details