ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ విధానాలపై యువత ఆగ్రహం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 12, 2023, 2:08 PM IST
Youth Fire on YSRCP Govt: ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల యువతలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిరు ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం సరైన రీతిలో ఏర్పాట్లు చేయలేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. అల్లారి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు వైద్య కళాశాలలో తాత్కాలిక చిరు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా వీటి కోసం యువత నుంచి తీవ్ర పోటీ నెలకొంది. భద్రాచలం వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా యువత పెద్ద సంఖ్యలో పాడేరు తరలివచ్చి దరఖాస్తులు చేస్తున్నారు.
Unemployed Problems in AP: దరఖాస్తులకు గడువు తక్కువ సమయం ఇవ్వడమే కాకుండా బ్యాంకుల నుంచి డీడీలు తీయాలన్న నిబంధన పెట్టడంతో యువత తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. డీడీలు తీయడానికి బ్యాంకుల వద్ద బారులు తీరుతూ ఇక్కట్లు పడ్డారు. దరఖాస్తులకు గడువు పెంచడంతో పాటు డీడీల విధానం కాకుండా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేలా వెసులుబాటు కల్పించాలని యువత కోరుతున్నారు.