ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Youngman suicide Attempt: పోలీసుల వేధింపులు.. యువకుడి ఆత్మహత్యా యత్నం - చిత్తూరు జిల్లా రామ కుప్పం మండలం ఎస్ గొల్లపల్లి

🎬 Watch Now: Feature Video

యువకుడి ఆత్మహత్యాయత్నం

By

Published : May 17, 2023, 6:48 PM IST

The young man tried to commit suicide : పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నాడు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ఎస్.గొల్లపల్లికి చెందిన సురేశ్ అనే యువకుడు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించాడు. సురేశ్​కు బైరెడ్డిపల్లె మండలం గుంతకురపల్లెకు చెందిన గాయత్రితో రెండేళ్ల కిందట వివాహమైంది. ఏడాదిగా భార్యాభర్తల మధ్య గొడవల వల్ల.. గాయత్రి పుట్టింటికి వెళ్లిపోయింది. తనను వేధిస్తున్నాడంటూ..  గాయత్రి సురేశ్​పై బైరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. గడచిన ఐదు రోజులుగా సురేశ్​ను విచారిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల వేధింపులు తట్టుకోలేక.. తన కుమారుడు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని బాధితుడి తల్లి వసంతమ్మ రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సురేశ్ ఉత్తరం రాసి పెట్టాడని తెలిపింది. సురేశ్ కుప్పంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో వైద్యం పొందుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details