పెన్సిల్‌పై జాతీయ గీతం ఔరా అనిపిస్తున్న మహబూబాబాద్ వాసి - జాతీయ పతకాన్ని పెన్సిల్ లెడ్లపై గీసిన నిఖిల్
కృషి.. పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునని నిరూపిస్తున్నాడు ఈ యువకుడు. అందరిలా మైక్రో ఆర్ట్ చేస్తే ఏం బాగుటుంది అనుకున్నాడు ఏమో.! భిన్నంగా ఏదో ఒకటి చేద్దామని సంకల్పించుకున్నాడు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేశాడు. పెన్సిల్‌పై చిన్న చిన్న బొమ్మలు గీస్తూనే.. తన కళకి పదును పెట్టాడు. ఇంకా ఏదైనా ఉన్నతంగా చేయాలని నిర్ణయించుకొని.. ఏకంగా మన జాతీయ గీతాన్నే పెన్సిల్ లెడ్లపై అందంగా చెక్కాడు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెన్సిల్ లెడ్లపై ఇంగ్లీషులో జనగణమన చెక్కి ఔరా అనిపించాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకోవడమే లక్ష్యంగా యువకుడు సాధన చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామానికి చెందిన నిఖిల్ చిన్నతనం నుంచే మైక్రో ఆర్ట్స్‌పై ఆసక్తి ఉండేది. గత నాలుగు సంవత్సరాలుగా చాక్ పీస్‌లు, పెన్సిల్ లెడ్స్‌పై చిన్న చిన్న బొమ్మలు చెక్కుతూ ఉండేవాడు.
గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం పురష్కరించుని బియ్యపు గింజపై జాతీయ జెండాను చెక్కి అందరి దృష్టిని ఆకర్షించాడు. గతేడాదే వినాయక చవితికి చాక్‌పీస్‌పై గణపతి ప్రతిమను గీసి ఔరా.! అనిపించాడు. అందరిలో గుర్తింపు రావాలని భావించి.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంగ్లీషులో జాతీయ గీతం 280 అక్షరాలను 13 పెన్సిల్ లెడ్ల పై, 15 గంటల పాటు శ్రమించి.. చెక్కి అందరిని అబ్బురపరిచాడు. జాతీయ, అంతర్జాతీయంగా మంచి గుర్తింపు సంపాదించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు యువకుడు తెలిపాడు.