ఆంధ్రప్రదేశ్

andhra pradesh

young_man_died

ETV Bharat / videos

యువకుడిని మింగేసిన క్వారీ గుంత - గేదెలను కడుగుతుండగా ప్రమాదం - Illegal quarrying in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 10:36 PM IST

Young Man Died after Falling into a Quarry Pit:గేదెలను కడిగేందుకు క్వారీ గుంతలోకి దిగిన యువకుడు గురువారం సాయంత్రం గల్లంతు కాగా శుక్రవారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని వెలికి తీశారు. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సత్తుపల్లి గ్రామానికి చెందిన తోట మహేష్ గురువారం మధ్యాహ్నం గేదెలను కడిగేందుకు వారి ఇంటికి సమీపంలో ఉన్న క్వారీ గుంత వద్దకు తీసుకు వెళ్లాడు. గేదెలను కడుగుతుండగా మహేష్ ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. సమాచారం అందుకున్న స్థానికులు గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది గురువారం రాత్రి ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని వెలికి తీశారు. 

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్  బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుమారుడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులను ఓదార్చారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ క్వారీ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఈ క్వారీ తవ్వకాల కారణంగా అమాయకులు బలైపోతున్నారని నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details