ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP_ Women_ Councillor_ Agitation_ in_ Madanapalle

ETV Bharat / videos

YCP Woman Councillor Agitation in Madanapalle: అభివృద్ధి పనులు ఎందుకు అడ్డుకుంటున్నారు.. వైసీపీ మహిళా కౌన్సిలర్ ఆందోళన - అన్నమయ్య జిల్లా రాజకీయాలు

By

Published : Aug 21, 2023, 6:10 PM IST

YCP Woman Councillor Agitation in Madanapalle : వార్డులో అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుకుంటున్నారంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట వైసీపీ 22వ వార్డు మహిళా కౌన్సిలర్ ముబీనా ఆందోళన చేశారు. తన వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి.. పనులు కూడా చేపట్టారని తెలిపారు. కానీ నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యకు పరిష్కారం చూపాలని పలుమార్లు కమిషనర్, చైర్ పర్సన్​ను కోరినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఈ తీరును నిరసిస్తూ ఆమె వార్డు ప్రజలతో మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి.. ప్రధాన గేటు ఎదుట ధర్నా చేశారు. కమిషనర్​పై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్డులో అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నది ఎవరో చెప్పాలని ముబీనా డిమాండ్ చేశారు. తాను అధికార పార్టీ కౌన్సిలర్​గా ఉన్నా.. తన వార్డులో అభివృద్ధి పనులు ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పురపాలక సంఘం కార్యాలయానికి వచ్చి కౌన్సిలర్ ముబీనాతో పాటు ఆమె భర్త సలీంను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.

ABOUT THE AUTHOR

...view details