ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అధికార, విపక్షాల మధ్య ఫ్లెక్సీల రగడ

ETV Bharat / videos

YCP vs TDP Flexi Controversy: ఫ్లెక్సీల రగడకు ఈసారి వేదిక మచిలీపట్నం.. ఎప్పటిలానే, పోలీసులు.. - కృష్ణా జిల్లా లేటెస్ట్ న్యూస్

By

Published : May 31, 2023, 1:49 PM IST

YCP vs TDP Flexi Controversy:అధికార, విపక్షాల మధ్య ఫ్లెక్సీల వివాదం తారా స్థాయికి చేరిపోతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బ్యానర్ల వివాదం నెలకొనగా.. తాజాగా కృష్ణాజిల్లాలో మరో ఫ్లెక్సీ వివాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మచిలీపట్నంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు బలవంతంగా తొలగించారు. దీంతో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్లను కూడా తొలగించాలని.. టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. 

అయితే చంద్రబాబు, పవన్​కల్యాణ్​ల పేరుతో వైసీపీ పెట్టిన బ్యానర్ల జోలికి మాత్రం పోలీసులు వెళ్లలేదు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలకు ఒక న్యాయం.. ప్రతిపక్ష పార్టీలకు ఒక న్యాయమా..?అని టీడీపీ నాయకులు పోలీసులను నిలదీశారు. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీలు మాత్రమే తొలగించటంపై టీడీపీ నేతలు నిరనస చేపట్టారు. 

కాగా.. మంగళవారం కూడా మచిలీపట్నంలో అధికార, విపక్షాల మధ్య ఫ్లెక్సీ వివాదం జరిగింది. వైసీపీ నేతలకు పోటీగా.. జనసైనికులు కోనేరు సెంటర్, బస్టాండ్ సెంటర్​ వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. అదే ప్రాంతంలో ఉన్న వైసీపీ బ్యానర్లును మాత్రం అధికారులు ముట్టుకోలేదు. దీంతో జనసైనికులకు, మున్సిపల్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details