ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ycp_social_empowerment_bus_trip

ETV Bharat / videos

'సామాజిక సాధికారత బస్సు యాత్ర'లో రోడ్లను ఆక్రమిస్తున్న వైసీపీ నేతలు - సామాన్యులకు ట్రాఫిక్ కష్టాలు - వైసీపీ బస్సు యాత్ర

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 5:37 PM IST

Updated : Nov 23, 2023, 8:12 PM IST

YCP Social Empowerment Bus Trip: వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్ర సామాన్యుల పాలిట ఇబ్బందిగా మారింది. పట్టణాల్లోని వీధుల్లో చేపడుతున్న కార్యక్రమాలతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. కడప నగరంలో వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామాజిక సాధికారిక యాత్ర వల్ల ప్రజలు ఉదయం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఏడు రోడ్ల కూడలి నుంచి పాత కలెక్టరేట్​కి వెళ్లే దారిని మొత్తం వైసీపీ నేతలు స్వాధీన పరుచుకున్నారు. 

దీంతో పాత కలెక్టరేట్​కి వెళ్లే వాహనదారులు అందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాత బస్టాండ్ నుంచి వెళ్లే వాహనాలను అనుమతించకపోవడంతో ఈ వాహనాలన్నీ ఆంజనేయ స్వామి గుడి రోడ్డుపై నుంచి వెళ్లడంతో ఎదురుగా వచ్చే వాహనాలతో ఆ రోడ్డు మొత్తం ట్రాఫిక్​తో కిక్కిరిసిపోయింది. అత్యధిక సౌండ్ వచ్చే స్పీకర్లతో రోడ్లపై వెళ్తుండడంతో చాలామంది ప్రజలు ఆ సౌండ్​కు తట్టుకోలేక ఇబ్బందులు పడ్డారు. తహసీల్దార్ కార్యాలయం, ఆర్డీ ఓ కార్యాలయానికి వెళ్లేవారు దారులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు దారి మళ్లించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 

Last Updated : Nov 23, 2023, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details