పెండింగ్ బిల్లులపై పట్టించుకోని ఎమ్మెల్యే, అధికారులు - సచివాలయానికి తాళం వేసిన వైసీపీ సర్పంచ్ - YSRCP Sarpanch Protest in satyasai district
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 3:51 PM IST
YSRCP Sarpanch Locked Secretariat for Non-payment of Bills: శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం కృష్ణాపురంలో గ్రామ సచివాలయానికి తాళం వేసి వైసీపీ సర్పంచ్ నిరసన తెలిపారు. చేసిన పనులకు అధికారులు బిల్లులు చెల్లించకపోవడంతో తాళం వేయాల్సి వచ్చిందని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని సర్పంచ్ మండిపడ్డారు.
Sarpanch Locked the Village Secretariat in Protest Over the Pending Bills: జిల్లాలోని మంగళవారం ఉదయం సర్పంచ్ గ్రామ సచివాలయానికి తాళం వేశారు. దీంతో సచివాలయంలో పనిచేసే అధికారులు బయటే నిరీక్షిస్తూ కూర్చున్నారు. సర్పంచ్‌కు సంబంధిత వ్యక్తి వచ్చి సచివాలయం తాళాలు తీసిన తరువాత అధికారులు కార్యాలయంలోకి చేరుకున్నారు. ఈ ఘటనపై సర్పంచ్ గౌస్ మోదిన్ మాట్లాడుతూ సెక్రటరీ లేక గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని,పెండింగ్‌లో ఉన్న బిల్లులు విషయం గురించి అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. అందుకు నిరసనగా గ్రామ సచివాలయానికి తాళాలు వేశానని సర్పంచ్ గౌస్ తెలిపారు.