ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ycp_ Sarpanch_ Land_ Encroachment

ETV Bharat / videos

YCP Sarpanch attempt to grab government land land : ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు వైసీపీ సర్పంచ్ యత్నం.. అడ్డుకున్న స్థానికులు - ap politics latest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2023, 1:37 PM IST

YCP Sarpanch attempt to grab government land land:  శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలం హెచ్​డీ హళ్లి పంచాయతీలోని గాయత్రి కాలనీ సమీపంలో గల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు జేసీబీ వాహనాలతో వైసీపీ సర్పంచ్ లక్ష్మమ్మ, ఆమె భర్త హనుమంతరాయప్ప భూమిని చదును చేయిస్తుండగా స్థానికులు అడ్డుకుని నిలదీశారు. ఈ వివాదంలో స్థానికులకు, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరువురిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ప్రభుత్వ భూమిని వైసీపీ నేతల నుంచి రక్షించాలని అధికారులను కోరినా స్పందించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు మాట్లాడుతూ.. మైరాడ అనే స్వచ్ఛంద సంస్థ చాలా సంవత్సరాల క్రితం గాయత్రి కాలనీ సమీపంలో గల ప్రభుత్వ బంజరు భూమిలో చెట్ల పెంపకం కోసం ప్రభుత్వ అనుమతితో నర్సరీ ఏర్పాటు చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆ సంస్థ ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అప్పజెప్పి వెళ్లింది. ప్రస్తుతం ఎంతో విలువ చేసే ఈ భూమిని కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారు. అధికారులు చొరవ చూపి ఈ భూమిని పేద ప్రజలకు ఇవ్వాలి లేదా పంచాయతీకి చెందేలా చర్యలు చేపట్టాలని ప్రజలు పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details