ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ysrcp_public_meeting_updates

ETV Bharat / videos

ట్రాఫిక్​ను ఆపేయడం, కుర్చీలు వేసేయడం - హంగామా తప్ప, కానరాని జనాలు- వెలవెలబోతున్న మంత్రుల యాత్రల సభలు - ycp news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 10:37 PM IST

Updated : Nov 22, 2023, 10:55 PM IST

YCP Samajika Sadhikaratha Public Meeting:వైసీపీ ప్రభుత్వం చేపట్టిన 'సామాజిక సాధికారత బస్సు యాత్ర'కు ప్రజల నుంచి స్పందన కరవైంది. జనాలను బలవంతంగా వాహనాల్లో తరలించినప్పటికీ.. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రసంగాలు ప్రారంభం కాకముందే సభ నుంచి వెనుదిరుగుతున్నారు. దీంతో వైసీపీ సాధికార బహిరంగ సభలు జనం లేక, ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో నిర్వహించిన వైసీపీ సాధికార బహిరంగ సభ జనం లేక వెలవెలబోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

YCP Samajika Sadhikaratha Bus Trip Updates: విశాఖలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వహించిన సాధికార బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. చుట్టుపక్కల నుంచి జనాలను బలవంతంగా వాహనాల్లో తరలించినప్పటికీ.. సభ మధ్యలోనే ఇంటి ముఖం పట్టారు. మరికొంతమంది మంత్రులు మాట్లాడుతుండగానే సభ నుంచి జారుకున్నారు. దీంతో సభలో జనాలు లేకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిబంధనలు పెట్టడంతో.. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో ఆర్టీసి సిబ్బంది, ప్రయాణికులు అక్కడి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. 

Last Updated : Nov 22, 2023, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details