ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ycp samajika sadhikara bus yatra in prakssam district

ETV Bharat / videos

వీళ్లు వైసీపీ కార్యకర్తలా ? పారిశుద్ధ్య కార్మికులా!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2023, 7:38 PM IST

YCP Samajika Sadhikara Bus Yatra in Prakssam District : ప్రకాశం జిల్లా కనిగిరి పురపాలక సంఘం ఒప్పంద కార్మికులు వైసీపీ సేవలో మునిగి తేలుతున్నారు. పట్టణంలో బుధవారం నిర్వహంచే వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను స్థానిక మున్సిపాలిటీలో పనిచేసే ఒప్పంద కార్మికులకు అప్పగించారు. దీంతో అధికార పార్టీ కార్యకర్తల్లా ఒప్పంద ఉద్యోగులు రాత్రనకా పగలనకా ఫ్లెక్సీలు, తోరణాలు కట్టే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎన్నడూ లేని విధంగా ఎక్కడికక్కడ మురుగు కాల్వలను శుభ్రం చేయడం సహా  ప్రధాన కూడలిలో రోడ్లపై భారీగా ఏర్పడిన గుంతలను పూడ్చి వేశారు. పారిశుద్ధ్య కార్మికుల తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.            

Muncipality Workers Arrangements for YCP Bus Yatra in Kanigiri : వాలంటీర్లు మున్సిపాలిటీ కార్మికుల పనితీరు, శ్రద్ధ చూసిన స్థానికులు ఇంతకాలం పట్టించుకోని పారిశుద్ధ్య పనులను ఇప్పటికిప్పుడు చేయడం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. మున్సిపాలిటీ కార్మికులా లేక  వైసీపీ పార్టీ కార్యకర్తలా అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details