తుస్సుమన్న వైసీపీ సామాజిక సాధికార యాత్ర - ఖాళీ కుర్చీలకే మంత్రి ప్రసంగం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 24, 2023, 7:55 AM IST
YCP Samajika Bus Yatra Failed In Kadapa: సామాజిక సాధికార బస్సు యాత్ర పేరిట వైసీపీ నిర్వహిస్తున్న సభలకు ప్రజలు రాకపోవడంతో వెలవెలబోతున్నాయి. కడప ఏడు రోడ్ల కూడలి వద్ద జరిగిన వైసీపీ సామాజిక సాధికారిక యాత్ర పూర్తిగా విఫలమైంది. సీఎం సొంత జిల్లా కడపలో నిర్వహించిన సభలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రసంగిస్తుండగానే ప్రజలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఏమి చేయలేక ఖాళీ కుర్చీలకే మంత్రి ప్రసంగం వినిపించారు. అప్పటికే కుర్చీలన్నీ దాదాపు 90 శాతం మేరకు ఖాళీ అవ్వగా..కేవలం వీఐపీలు కూర్చున్న ప్రదేశంలో తప్ప మిగిలిన ప్రాంతమంతా ఖాళీ అయ్యాయి. దాదాపు 5వేల మంది వస్తారని అంచనాతో భారీగా ఏర్పాట్లు చేశారు. కానీ ఎవరు రాకపోవడంతో వైకాపా నాయకులకు నిరాశే మిగిలింది. డ్వాక్రా సభ్యులు తప్ప సాధారణ ప్రజలు ఎవరు సభకు హాజరు కాలేదు. ఈ సభను కేవలం గంటన్నర వ్యవధిలోనే ముగించడం చర్చనీయాంశమైంది. ఇతర జిల్లాల కంటే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కడపలో సామాజిక సాధికారిక యాత్ర విఫలం కావడంతో నాయకులు గుబులు చెందారు.